Coffeehouse for desis
Would you like to react to this message? Create an account in a few clicks or log in to continue.

కొన్ని మంచి పాయింట్లు

2 posters

Go down

కొన్ని మంచి పాయింట్లు Empty కొన్ని మంచి పాయింట్లు

Post by b_A Fri Sep 19, 2014 8:38 pm

తాత్కాలిక రాజధానికి తరలింపుకు ఉద్యోగులు సుముఖులా?

ఈ అయోమయం వదలాలంటే విజయవాడలో తాత్కాలిక రాజధాని పెట్టి అక్కడకు తరలించాలి అంటున్నారు. అదంత సులభమా? విభజన జరిగినా పదేళ్లపాటు హైదరాబాదులోనే ఉమ్మడి రాజధాని వుంటుంది, మనం యిక్కడే లాగించేయవచ్చు, మహా అయితే చివర్లో వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకోవచ్చు అని హైదరాబాదులోని 45 ఏళ్ల వయసు పై బడిన ఆంధ్ర ఉద్యోగుల్లో చాలామంది అనుకుని వుంటారు. వాళ్లందరికీ యిప్పుడే తరలిపోవడం రుచించదు. తరలించే ప్రతిపాదన వచ్చినప్పుడల్లా వాళ్లు ఏదో కారణం చూపి దాన్ని వాయిదా వేయించవచ్చు. కేంద్రం అధికారంలోకి వస్తుందనో, పర్యావరణానికి అడ్డు వస్తుందనో, రూల్సు అనుమతించవనో ఏదో ఒక సాకు చెప్పడంలో వాళ్లు ఘనులు. తెగించి ఎవరినైనా బదిలీ చేస్తే ఎకడమిక్‌ యియర్‌ పూర్తయ్యేవరకైనా వుంచండి లేదా నా ముసలి తలిదండ్రులు అనారోగ్యంగా వున్నారు, వారిని ఓ రెండేళ్లు సేవించి రానీయండి అంటూ అర్జీలు పెడతారు. ఫిషింగ్‌ కార్పోరేషన్‌ లేదా ఒఎన్‌జిసి కార్యకలాపాలన్నీ సముద్రతీరంలో వుండగా ఆఫీసు హైదరాబాదులో పెట్టారేమిటి? అంటూ ప్రశ్నిస్తూ వుంటారు కొందరు అమాయకులు. అదంతా ఉన్నతాధికారుల మాయాజాలం. సముద్రం వుంది కదాని చిన్నచిన్న వూళ్లల్లో వుండడం వాళ్లకు కుదరదు. హైదరాబాదు వంటి మహానగరంలోనే వుండడానికి కుటుంబం యిష్టపడుతుంది. పిల్లల చదువులు, వినోదవిహారాలకు అవకాశాలు, బంధుమిత్రులతో సంపర్కం, నాణ్యమైన జీవనశైలి - యివన్నీ సమకూరాలంటే నగరవాసం తప్పదు.

మానవ వనరుల ఆలోచనా సరళి ఎలా వుంటుంది?

ఈ మధ్యే గుజరాత్‌, రాజస్తాన్‌ తిరిగి వచ్చాను. గుజరాత్‌లో ఐటీ పరిశ్రమ ఎందుకు రాలేదు? అని అహ్మదాబాద్‌లో పనిచేసే గుజరాతీ ఐటీ నిపుణున్ని అడిగాను. 'ఇక్కడ మద్యనిషేధం వుంది, నైట్‌ లైఫ్‌ లేదు. ఏ ఐటీ ఉద్యోగికి రావాలని వుంటుంది? వాళ్లలో చాలామంది సౌత్‌ ఇండియా వాళ్లే. అక్కడక్కడే బెంగుళూరు, పుణె, చెన్నయ్‌, హైదరాబాద్‌ లలో ఉద్యోగాలు దొరుకుతున్నాయి. ఉద్యోగం మారాలన్నా మరో కంపెనీ అదే వూళ్లోనో, పక్కూళ్లోనో యింకోటి దొరుకుతోంది. ఇక్కడైతే ఒకటీ, అరా కంపెనీలు! మారడానికి వీల్లేక కొట్టుమిట్టులాడాలి.'' అన్నాడు. ముద్రా కమ్యూనికేషన్స్‌ను అహ్మదాబాద్‌లో స్థాపించేటప్పుడు పడిన కష్టాల గురించి ఎజి కృష్ణమూర్తి రాశారు. ఏడ్‌ ఏజన్సీలన్నీ బొంబాయిలోనే గూడు కట్టుకుని వున్నాయి. అక్కడ లైఫ్‌లో హుషారే వేరు. అహ్మదాబాద్‌లో, మందు పార్టీలు కూడా చేసుకోవడానికి వీల్లేదంటే ఒక్క యాడ్‌ నిపుణుడూ రాలేదట. వీళ్లే తయారుచేసుకున్నారు. ఎంత శ్రమ, ఎంత సమయం ఖర్చుపెట్టాలో వూహించుకోండి.

''ఉదయ్‌పూర్‌కూడా వెళ్లి వచ్చాను. అక్కడ ప్రొహిబిషన్‌ లేదు. ఐటీ అన్న పదమే వినబడలేదు.'' అన్నాను. ''అక్కడ చదువుల మీద శ్రద్ధే లేదు. మనుష్యుల్లో సోఫిష్టికేషన్‌ లేదు. మీకు తెలుసా? ఉదయపూర్‌ మొత్తానికి రెండే రెండు సినిమాహాళ్లు వున్నాయి. అవీ డొక్కువి. ఐటీ వాళ్లు పోతారా?'' అన్నాడతను. పరిశ్రమలు అక్కడ పెడతాం, యిక్కడ పెడతాం అని ఎడాపెడా ప్రకటనలు యిచ్చేసేముందు యిలాటి హ్యూమన్‌ ఫ్యాక్టర్‌ కూడా పరిగణనలోకి తీసుకోవాలి. 'బాసరలో ఐఐటి పెట్టండి, సరస్వతీకృపతో ఆటోమెటిక్‌గా చదువు వచ్చేస్తుంది' (అదే నిజమైతే అక్షరాస్యతలో ఆదిలాబాద్‌ అగ్రస్థానంలో వుండాలి) అని ఎందరు చెప్పినా వినకుండా 'అక్కడ పెడితే ఫ్యాకల్టీ దొరకడం కష్టం' అంటూ వైయస్‌ హైదరాబాదులో ఐఐటీ పెట్టడానికి యిలాటి కన్సిడరేషన్లే కారణం. వాతావరణం కూడా ఒక బలమైన ఫ్యాక్టర్‌. గనులున్న చోట వేడి భరించడం కష్టం కాబట్టి మైనింగ్‌ యింజనియర్‌ను పెళ్లాడడానికి ముందుకు వచ్చేవాళ్లు తక్కువ. 'నెలకో ఓ పదివేలు తక్కువ యిచ్చినా బెంగుళూరులోనే పనిచేస్తా. చెన్నయ్‌లో చెమట భరించలేను బాబూ' అనేవాళ్లు చాలామంది కనబడ్డారు. వాతావరణం విషయంలో హైదరాబాదుకి అలవాటు పడినవాడు తెలుగు రాష్ట్రాలలో వేరెక్కడికీ వెళ్లడానికి యిష్టపడడు. అందునా బ్లేజ్‌ వాడగా పిలవబడే బెజవాడ వెళ్లాలంటే చాలా గుండె ధైర్యం కావాలి.

హైదరాబాదు వదలడానికి బాబు మాత్రం యిష్టపడతారా?

ఆ మాటకొస్తే హైదరాబాదును కెసియార్‌కు ధారాదత్తం చేసి వెళ్లడం బాబుకీ యిష్టం లేదు. ఏదో పేరుతో యిక్కడే మసలుతూ, తన పార్టీ నాయకులకు సూచనలు చేస్తూ, వార్తల్లో నలుగుతూ, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు తన పార్టీని సిద్ధం చేయాలని ఆయన ప్లాను. తను విజయవాడలో కాపురం పెట్టి తెలంగాణ టిడిపి యూనిట్‌కు హైదరాబాదు వదిలేస్తే యిక్కడ ప్రత్యామ్నాయ నాయకత్వం ఎదగవచ్చు. ఢిల్లీ పాలకులకు దక్కన్‌ ఎప్పుడూ తలకాయనొప్పిగానే వుండేది - ఎప్పుడు తిరగబడతారో అని. అందుకని చక్రవర్తి తన కొడుకుల్లో ఒకణ్ని ఎప్పుడూ యిక్కడ రాజప్రతినిథిగా వుంచేవారు. అలా లోకేశ్‌ను తెలంగాణలో పెట్టినా, ఏ మేరకు అదుపు చేయగలరో తెలియదు. విజయవాడలో యింకా ఏదీ అమరలేదు. గన్నవరం విమానాశ్రయం బొమ్మరిల్లులా వుందని వెంకయ్యనాయుడు అన్నారు. మాటిమాటికి ఢిల్లీ వెళ్లాలన్నా, యిక్కడకు వచ్చిన జాతీయనాయకులను ఆహ్వానించాలన్నా హైదరాబాదు అడ్డా వదులుకోకూడదు. ఇంకో విషయం కూడా వుంది. మీడియా యింకా విజయవాడకు షిఫ్ట్‌ కాలేదు. పత్రికలు, టీవీల హెడ్‌ ఆఫీసులన్నీ యిక్కడే వున్నాయి. హైదరాబాదు వాళ్లకే స్టూడియో చర్చల్లో అవకాశం దక్కుతోంది. ఆంధ్రలో వుండే నాయకులు చెవులకు యియర్‌ ఫోన్స్‌ తగిలించుకుని 'నాకూ ఛాన్సివ్వండి' అంటూ చెయ్యెత్తుతూ స్క్రీన్‌పై కనబడుతున్నారు. బాబుకు, ఆయన పార్టీకి వూపిరి పోసినది, పోస్తున్నది మీడియానే. హైదరాబాదు నుంచి మీడియా చీలి అటు వచ్చేదాకా బాబు అటు వెళ్లడానికి యిచ్చగించరని నా అంచనా.

ఇలా ఆలోచిస్తే ఆఫీసులు ఎప్పుడు తరలుతాయో, సిబ్బంది ఎప్పుడు లేస్తారో, ఫైళ్లు ఎప్పుడు కదులుతాయో ఎవరూ చెప్పలేరు. అధికారగణం లేకుండా నిర్ణయాలు ఎలా తీసుకోగలరు? ఎలా అమలు చేయగలరు? తాత్కాలిక రాజధాని వ్యవహారమే యిలా వుంటే శాశ్వత రాజధాని సంగతి చెప్పేదేముంది? విజయవాడ పరిసరాల్లో అని చెప్పేసి ఊహాగానాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టేశారు. అంతవరకు బాగానే వుంది, కానీ అక్కడ భూములు ఎలా సేకరించగలరో, ఎలా కట్టగలరో, ఎన్ని థాబ్దాలు పడుతుందో ఎవరూ చెప్పలేరు. రాజధాని నిర్ణయం తప్ప బాబు తీసుకున్న మేజర్‌ నిర్ణయం ఏదీ లేదు. లక్షన్నర దాకా ఋణమాఫీ చేస్తాం అనే నిర్ణయం తీసుకున్నారు కానీ ఎలా చేయాలన్నది నిర్ణయించలేదు. పరిశ్రమలు ఆహ్వానిస్తున్నాం, వారెవరో వచ్చేస్తున్నారు.. వంటి ప్రకటనలు గత టిడిపి పాలన నుండి, కాంగ్రెసు పాలనదాకా వింటూనే వచ్చాం. ఎవరో వచ్చారు, డాలర్లు కురిపిస్తారు అంటారు, చుట్టుపట్ల స్థలాలు అమ్మేస్తారు, భూమి ఎలాట్‌ చేయించుకున్నవాడు ఇండస్ట్రీ మాత్రం పెట్టడు. అయిదారేళ్లు చూసి ప్రభుత్వం వెనక్కి యిచ్చేయమంటుంది. ఈ లోగా ఆ పారిశ్రామిక వేత్త ఏ జైలుకి వెళతాడో, ఎంత పతనం చెందుతాడో తెలియదు. ఈ తంతు చూసి, చూసి విసిగి ఫ్యాక్టరీ ప్రారంభోత్సవాలు జరిగినప్పుడే నమ్మాలి అని నిశ్చయించుకున్నాను. శంకుస్థాపనలు కూడా నమ్మడం మానేశాను.

ప్రస్తుతానికి చూస్తే తెలంగాణలో అనువైన పరిస్థితులున్నాయి కానీ పాలన ఎలా వుంటుందో, భూమిపుత్రుల వాదంతో చిక్కులు సృష్టిస్తారేమోనన్న భయం వుంది. ఆంధ్రలో చూస్తే భూముల రేట్లు ఆకాశాన్నంటాయి. జిల్లాల వారీగా రాబోయే యూనిట్ల లిస్టు చూపించి రియల్టర్లు ఆశలు చూపిస్తున్నారు, కలలు అమ్ముతున్నారు. రేట్ల విషయంలో భూమి సొంతదారులు కొమ్మెక్కి కూర్చున్నారు. స్థలానికే అంత పెడితే, పరిశ్రమ నడపడం కిట్టుబాటు కాదని పారిశ్రామికవేత్తలు దడుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మన రాష్ట్రాల్లో ఎక్కడ ఏ పరిశ్రమ వస్తుందో, వచ్చినా నిలుస్తుందో లేదో వంద రోజుల్లో కాదు కదా, వెయ్యి రోజుల్లో కూడా చెప్పడం సాధ్యం కాదు.

http://telugu.greatandhra.com/articles/mbs/mbs-100-days-rule-55803.html

b_A

Posts : 1642
Join date : 2011-05-08

Back to top Go down

కొన్ని మంచి పాయింట్లు Empty Re: కొన్ని మంచి పాయింట్లు

Post by Vakavaka Pakapaka Fri Sep 19, 2014 10:11 pm

This is a pessimistic analysis. May be the author should visit Southern California and Arizona and see how people are living in very hot places. Coastal AP has a lot of positives and is nowhere near as hot as Arizona. Naidu should concentrate on building the infrastructure and giving incentives to industrialists to invest. There are people who prefer to live in Kakinada and Vizag rather than Turaka Hyderabad. I spent a few days in Pattabhipuram in Guntur. Preservation of culture is still a priority to families living there. They prefer their kids getting jobs in coastal areas.

Vakavaka Pakapaka

Posts : 7611
Join date : 2012-08-24

Back to top Go down

Back to top

- Similar topics

 
Permissions in this forum:
You cannot reply to topics in this forum