చదివితే మనసెల్ల కుదిపేటి కవిత:-) Hitskin_logo Hitskin.com

This is a Hitskin.com skin preview
Install the skinReturn to the skin page

Coffeehouse for desis
Would you like to react to this message? Create an account in a few clicks or log in to continue.

చదివితే మనసెల్ల కుదిపేటి కవిత:-)

2 posters

Go down

చదివితే మనసెల్ల కుదిపేటి కవిత:-) Empty చదివితే మనసెల్ల కుదిపేటి కవిత:-)

Post by indophile Tue Aug 02, 2011 2:45 pm

ఇది చిన్న కవిత

ఇది చిన్న కవిత

చదివితే మనసెల్ల కుదిపేటి కవిత

గది వెల్ల పిల్లేమొ విదిలించు కవిత



http://www.eemaata.com/em/issues/200607/861.html

indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

చదివితే మనసెల్ల కుదిపేటి కవిత:-) Empty Re: చదివితే మనసెల్ల కుదిపేటి కవిత:-)

Post by The Absolute Zero Tue Aug 02, 2011 3:37 pm

దాని కింద రాసిన కామెంట్లు చదివేరా? పదో లైన్ తర్వాత అంతా అనవసరం. :-) చెప్పక, చెప్పక ఈమాట గురించే చెప్పారూ? ఒకసారి మీరు రాసింది ఏదైనా వాళ్ళకి పంపించి చూడండి. ఎడిటర్లు ఏమైనా రాస్తారేమో/రాసారో తెలీదు కానీ, కోడిగుడ్డుకి వెంట్రుకలు పీకమంటే వీళ్ళందరూ మొదటి ప్రైజ్ కి రడీ. రాయడం చేతకాని వాళ్ళందరూ ఏమౌతారంటే.. ఎడిటర్లు.

సగం చదువుతారు మీరు పంపించింది. మిగతాది మీరెన్ని చెప్పినా శంఖం ఊదినట్టే. ఒక్కోసారి మొత్తం మార్చేసి ప్రచురించాక చెప్తారు. ఇదేమిటి అని అడగడానికి లేకుండా. ఆ మధ్యన సులేఖ లో ఉండే నాశి సంకాగిరి అనే ఆయన కొంతకాలం దీనికి ఎడిటర్ గా ఉండేవారు. మనస్పర్ధలు వచ్చాయి కాబోలు బయటకి వెళ్ళేరో/పంపించారో మరి. ఒక రచయిత మీద 'సాహిత్యం' మీద దుమ్ము దులిపినందుకు అని నా అనుమానం. కొంత మంది రచయితలకి ఇక్కడ పీట. అంచేత అవే పేర్లు మళ్ళీ మళ్ళీ కనపడుతూ ఉంటాయ్. వాళ్ళ తాతలు నేతులు తాగారు మరి ఏమి జేస్తాం.

The Absolute Zero

Posts : 655
Join date : 2011-04-29

Back to top Go down

చదివితే మనసెల్ల కుదిపేటి కవిత:-) Empty Re: చదివితే మనసెల్ల కుదిపేటి కవిత:-)

Post by indophile Tue Aug 02, 2011 4:23 pm

జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు (కరుణశ్రీ) భావ కవిత్వం అంటే ఇలా ఉండాలంటున్నారు మరి:-)



దోసెడు పారిజాతములతో హృదయేశ్వరి

మెల్ల మెల్లగా డాసిన భంగి

మేలిమి కడాని వరాల కరాలు వచ్చి

కన్మూసిన భంగి

కన్నె నగుమోము పయిన్ నును సిగ్గు మొగ్గ

కైసేసిన భంగి

అందముల్ చిందెడి నందన వాటి వెన్నెలల్

కాసిన భంగి

జానపద కాంతలు రాట్నము మీద దారముల్

తీసిన భంగి

క్రొవ్వలపులేఖ తలోదరి తామరాకు పై

వ్రాసిన భంగి

పెండ్లి తలంబ్రాల్ జవరాలు రవంత నిక్కి

పై బోసిన భంగి

పొంగు వలపుల్, తలపుల్, సొలపుల్

ప్రసన్నతల్, భాసురతల్, మనోఙ్ఙతల్

ప్రౌఢిమముల్, రసభావముల్, కడు భాసిలు నట్టు

indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

చదివితే మనసెల్ల కుదిపేటి కవిత:-) Empty Re: చదివితే మనసెల్ల కుదిపేటి కవిత:-)

Post by Sponsored content


Sponsored content


Back to top Go down

Back to top

- Similar topics

 
Permissions in this forum:
You cannot reply to topics in this forum